అక్కడ ఆడుకుంటున్న అర్చకుల పిల్లలకు మాయమాటలు చెప్పి, కొబ్బెర, బెల్లం ఇచ్చాడు.
గుడి తలుపులు తెరవటానికి అర్చకుడి ఇంట్లో ఉండే కుంచెకోలను తెప్పించుకున్నాడు.
గుడిలో ప్రవేశించి, పిల్లలను పిలిచాడు.
తలుపు బయటనుండి బీగం వేసి, కుంచెకోలను యథాస్థానంలో ఉంచమని చెప్పాడు.
వాళ్లు అలాగే చేసి తిరిగి ఆడుకోవటానికి వెళ్లిపోయారు.
అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు.
తలుపులు వేసిన గుడిలో చీకటిగా ఉన్నా, కుబేరగుప్తుడు తట్టుకుంటూ ఎలాగో శివలింగం దగ్గరికి చేరాడు.
శివుడికి మొక్కి,
"దేవా! మీరు వేదశర్మకు నంది ద్వారా ఇవ్వదలచిన పదివేలనిష్కముల పై హక్కు ఇప్పుడు నాది.
రెండువేలు ఇచ్చి ఆ హక్కును కొన్నాను.
ఆ పత్రం కూడా ఉంది",
అని అందులో రాసినదంతా శివలింగానికి వినపడేలా చదివాడు.
కానీ జవాబు లేదు. శివలింగం ఎక్కడైనా పలుకుతుందా?
ఎన్నిసార్లు అడిగినా బదులు లేకపోయేసరికి కుబేరగుప్తుడికి దిగులు మొదలైంది,
"మోసపోయానా?
శివుడు పలకలేదేమిటి?
పత్రం సరిగ్గానే ఉందికదా?
అయ్యో! కొంప మునిగినట్లుంది!
బిచ్చం కూడా పెట్టకుండా కూడబెట్టిన సొమ్మును ఆ పాపాత్ముడికి అర్పణం చేశానే!",
అని తత్తరపడుతుండగా ఒక ఆలోచన తట్టింది.
"ఓహో! ఆలోచించక తొందరపడ్డాను.
ఇవ్వవలసిన బాధ్యత నందిది కదా.
ఈ విషయం గురించి శివుడిని అడగటం నా దోషం.
మర్యాద ఎంచకుండా మాట్లాడినందుకు శివుడు కోపగించి పలకటం లేదు.
దేవా! నన్ను మన్నించాలి",
అని చెంపలుకొట్టుకొని, గర్భగృహం నుండి బయటకు వచ్చి నంది దగ్గరకు వెళ్లాడు.
ఆ నంది గుడిలోపలే గర్భగృహం ఎదురుగా కొంతదూరంలో ఉంది.
కుబేరగుప్తుడు నంది దగ్గర కూడా పత్రం చదివి డబ్బులు అడిగాడు.
కానీ ఇచ్చేవాళ్లెవరు?! బదులు లేదు.
శాంతంగా, నిష్ఠూరంగా, దౌర్జన్యంగా అడిగిచూశాడు. జవాబు లేదు.
వర్తకుడికి ప్రపంచం కుంగినట్లు తోచింది.
మహాకోపంతో,
"ఇదేమి న్యాయం?
దేవుళ్లే అబద్ధాలు చెప్తే ఇక మనుషుల సంగతేమిటి?
ఓరీ నందీ! పలకకపోతే విడిచిపోవటానికి నేను వెర్రివాడిని కాదు.
నా సొమ్ము నాకివ్వకపోతే మొహమాటం, మర్యాద చూడకుండా నీ తల పగలగొడతాను",
అని కాలికి తగిలిన ఒక రాయిని నందిపై విసిరికొట్టాడు.
Saturday, October 3, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment